తలసరి ఆదాయం రూ.2,28,216
ABN, First Publish Date - 2020-03-09T07:36:37+05:30
తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకెళుతోంది. 2019-20లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,28,216 కాగా..
జాతీయ సగటు రూ.1,34,432
సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2020లో వెల్లడి
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకెళుతోంది. 2019-20లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,28,216 కాగా.. జాతీయ సగటు కేవలం రూ.1,34,432 కావడం గమనార్హం. 2018-19తో పోలిస్తే దాదాపు రూ.24వేలు.. రాష్ట్రం ఏర్పడిన 2014-15తో పోలిస్తే రూ.లక్షకు పైగా పెరగడం విశేషం. ఆదివారం అసెంబ్లీలో సమర్పించిన సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్(సామాజిక, ఆర్థిక ముఖచిత్రం)- 2020లో ఈ విషయాలను వెల్లడించారు.
స్థూల జిల్లా ఉత్పత్తి (గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో రూ.1,73,143కోట్లతో రంగారెడ్డి, రూ.1,67,231 కోట్లతో హైదరాబాద్ ముందున్నాయి. రూ.6628 కోట్లతో నారాయణపేట, రూ.5934కోట్లతో ములుగు చివరన నిలిచాయి.
జూ జిల్లాల స్థాయిలో తలసరి ఆదాయం (డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటా ఇన్‌కమ్)లో రూ.5,78,979తో రంగారెడ్డి అగ్రస్థానంలో, రూ.3,57,287తో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. రూ.1,11,717తో జగిత్యాల, రూ.98,220తో నారాయణపేట చివరిస్థానాల్లో ఉన్నాయి.
2018-19లో రాష్ట్రంలో ధాన్యాలు, చిరుధాన్యాల సాగు 25.45 లక్షల హెక్టార్లలో జరిగింది. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇది 72 శాతం. వీటిల్లో వరి 54.7ు, మొక్కజొన్న 25.4ు, జొన్నలు 1.6ు, పప్పుధాన్యాలు 14.5ు, కూరగాయలు 3.1ు, పండ్లు 4.6ు సాగు చేశారు.
జూ రైతు బీమా పథకం కింద.. 2018-19లో 17,366 మందికి రూ.868.3 కోట్లు, 2019-20 (డిసెంబరు నాటికి) 4,520 మందికి రూ.226 కోట్లు పంపిణీ చేశారు. బీమా పంపిణీలో 91ు మంది సన్న, చిన్నకారు రైతులే. బీమా లబ్ధి పొందిన కుటుంబాల్లో 83ు మంది దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల వారున్నారు.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పథకం 2021 నాటికి పూర్తి కానుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికీ16 నుంచి 20 ఎంబీపీఎస్ వరకు, ప్రభుత్వ కార్యాలయాలకు 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్‌నెట్ సేవలను అందించనున్నారు.
కేసీఆర్ కిట్ కింద 2017-18లో 5.56లక్షలు, 2018- 19లో 6.13లక్షలు, 2019-20లో డిసెంబరు నాటికి 4.33 లక్షల మంది గర్భిణులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఇక.. తలసరి అప్పు విషయానికి వస్తే 2020-21 చివరినాటికి రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు. ఈలెక్కన తలసరి అప్పు దాదాపుగా రూ.61 వేల దాకా ఉంటుందని ఆర్థిక నిపుణులు వివరించారు.
ప్రతి పౌరుడిపై రూ.61,780 అప్పు!
రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపైనా రూ.61,780 అప్పు ఉంది. మొత్తం రాష్ట్ర అప్పు రూ.2,29,205 కోట్లుగా నమోదయింది. 2017-18లో రూ.1,52,190 కోట్లుగా ఉన్న అప్పు ఏటేటా పెరుగుతూ పోతోంది. అయితే.. రాష్ట్ర జీఎ్‌సడీపీతో పోలిస్తే ఈ అప్పుల శాతం నికరంగానే ఉంటూ వస్తోంది. నికరంగా 20 శాతం అటు ఇటుగా కొనసాగుతోంది.
రాష్ట్రంలో అప్పుల వివరాలు...
ఏడాది అప్పు డీఎస్‌డీపీలోఅప్పుల శాతం(రూ.కోట్లలో)
2017-18 1,52,190 20.21
2018-19 1,75,281 20.25
2019-20 1,99,215 20.55
2020-21 2,29,205 20.74
అక్షరాస్యతలో వెనకే!
‘ఈచ్ వన్-టీచ్ వన్’లో భాగంగా 18ఏళ్లకు పైబడిన వారు నిరక్షరాస్యులై ఉంటే వారిని అక్షరాస్యులను చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 1,64,068 మంది నిరక్షరాస్యులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. కానీ.. అక్షరాస్యతలో జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ వెనుకబడింది.
వయసుల వారీగా అక్షరాస్యత వివరాలు (అంకెలు శాతాల్లో)
వయసు తెలంగాణ జాతీయ గణాంకాలు
7-14 90.56 87.92
15-24 86.97 86.14
25-34 69.62 75.28
35-49 51.61 63.73
50+ 35.85 49.92
మొత్తం 66.54 72.98
Updated Date - 2020-03-09T07:36:37+05:30 IST