తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2020-03-27T19:17:09+05:30
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో..
హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును 3 నెలలకు పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు స్టే ఆర్డర్ల కొనసాగింపు ఉంటుందని పేర్కొంది. ఈ నెల 20తో ముగిసిన కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును పొడిగిస్తూ ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - 2020-03-27T19:17:09+05:30 IST