అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2020-12-16T01:58:02+05:30
అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ అగ్రిగోల్డ్ ఆఫీస్ వేలంపాట ఆమోదంపై తెలంగాణ హైకోర్టు దాఖలైన
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ అగ్రిగోల్డ్ ఆఫీస్ వేలంపాట ఆమోదంపై తెలంగాణ హైకోర్టు దాఖలైన దరఖాస్తును పరిశీలించింది. రూ.14 కోట్లకు పైగా బిడ్డింగ్‌లో అమ్ముడుపోయినట్లు ఆంధ్రాబ్యాంకు తరపు లాయర్ కోర్టుకు నివేదించారు. అమ్మకానికి అభ్యంతరం లేదని అగ్రిగోల్డ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విలువైన భవనాలను తక్కువ ధరకే బ్యాంకులు విక్రయించడంపై అభ్యంతరం తెలిపారు. భవనం విలువ రూ.26 కోట్లు నుంచి 14 కోట్లకు తగ్గిందని పిటిషనర్ పేర్కొన్నారు. డిపాజిటర్లకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2020-12-16T01:58:02+05:30 IST