ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ భేష్‌

ABN, First Publish Date - 2020-07-07T07:13:26+05:30

‘కరోనా సంక్షోభాన్ని వస్త్ర పరిశ్రమ ఒక అవకాశంగా తీసుకుని పీపీఈ కిట్లు తయారు చేస్తోంది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది’ అని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా సంక్షోభాన్ని వస్త్ర పరిశ్రమ ఒక అవకాశంగా తీసుకుని పీపీఈ కిట్లు తయారు చేస్తోంది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది’ అని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం తనదైన శైలిలో పోటీ పడుతోందని ప్రశంసించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సరే.. పెట్టుబడులకు ముందుకొచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం, ఇన్వె్‌స్టమెంట్‌ ఇండియా సహకారం ఉంటుందని చెప్పారు. ఇన్వెస్ట్‌ ఇండియా సోమవారం నిర్వహించిన టెక్స్‌టైల్‌ అప్పారెల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మీట్‌ (వీడియో కాన్ఫరెన్స్‌)లో స్మృతి ఇరానీతో పాటు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, చేనేత-జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో అనేక అవకాశాలున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. పెట్టుబడిదారులను సాదరంగా స్వాగతిస్తామని, ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ రంగానికి ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్‌ వివరించారు. ఆరేళ్లలో అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన పత్తి.. తెలంగాణలో 63 లక్షల ఎకరాల్లో సాగవుతోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇతర అంశాలను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పరిశ్ర మలు నెలకొల్పేందుకు తెలంగాణ అనుకూలమని వెల్‌స్పన్‌ సీఈఓ దీపాలి గోయెంకా అన్నారు. ఇక్కడ పెట్టుబడులకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. తెలంగాణలో అత్యంత దీర్ఘకాల దృక్ఫథం ఉన్న నాయకత్వ ప్రభుత్వం ఉందని తెలిపారు.

Updated Date - 2020-07-07T07:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising