ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీకి జాతీయ స్థాయి గుర్తింపు- సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2020-06-19T00:42:21+05:30

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సిఆర్‌ఐ)కు జాతీయ స్థాయి గుర్తింపు ఇండియన్‌ఫారెస్ట్‌ కౌన్సిల్‌ నుంచి ఎ+ కేటగిరీ విద్యాసంస్థగా గుర్తింపు రావడం ప్రభుత్వ కృషికి ఫలితమని ముఖ్యమ్రంతి కేసీఆర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్‌సిఆర్‌ఐ)కు జాతీయ స్థాయి గుర్తింపు ఇండియన్‌ఫారెస్ట్‌ కౌన్సిల్‌ నుంచి ఎ+ కేటగిరీ విద్యాసంస్థగా గుర్తింపు రావడం ప్రభుత్వ కృషికి ఫలితమని ముఖ్యమ్రంతి కేసీఆర్‌ అన్నారు. ఈమేరకు అటవీశాఖ అధికారులు, సిబ్బందిని, విద్యార్దులను ఆయన అభినందించారు. అటవీ విద్యాబోదన,పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ కళాశాల , పరిశోధనా సంస్థ కేంద్ర ప్రభుత్వంతో ఎ+ కేటగిరీగా గుర్తింపు పొందింది. అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ర్టీ రీసెర్చి అండ్‌ ఎడ్యుకేషన్‌ తెలంగాణ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపును ఇచ్చింది.


ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అటవీశాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్దులను అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అడవులు ,పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధ్యాతను ఇస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం జరిగింది. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి ధీటుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో 2015లో కాలేజీ స్థాపన 2016లో బీఎస్సీ ఫారెస్ర్టీ మొదటి బ్యాచ్‌ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ ఏడాదే ఫైనల్‌ఇయర్‌విద్యార్దులు తమ కోర్సు పూర్తిచేసుకుంటున్నారు.


ముందుగా దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో మొదలైన కాలేజీ గత సంవత్సరం డిసెంబరులో హైదరాబాద్‌ శివారులోని ములుగులో సొంత క్యాంపస్‌లోకి మారింది. అత్యంత ఆదునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్తక్యాంపస్‌ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. తొలినాళ్లలో ఇంర్మీడియట్‌ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. తర్వాత ఎంసెట్‌కౌన్సిలింగ్‌  ఆధారంగా ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు బ్రిటీష్‌ కొలంబియా, అబర్న్‌ యూనివర్శిటీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్ధికి అబర్న్‌ యూనివర్శిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటు ఆఫర్‌చేసింది. తాజాగా ఏ ప్లస్‌ గుర్తింపు లభించడంతో తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు రానుంది. 

Updated Date - 2020-06-19T00:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising