ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం.. స్పందించిన కన్వీనర్ గోవర్థన్

ABN, First Publish Date - 2020-10-08T04:08:04+05:30

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఎంసెట్‌‌లో కటాఫ్ మార్కులు వచ్చినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఎంసెట్‌‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్మీడియట్‌‌ అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది. ఈ ఫలితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అటు పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు వచ్చాయి. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించారు. దీంతో విద్యార్థులు ఆయోమయానికి గురయ్యారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. 


అయితే ఈ గందరగోళంపై తెలంగాణ ఎంసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ గోవర్థన్ స్పందించారు. కొందరు విద్యార్థులు హాల్‌ టికెట్ నెంబర్లు తప్పుగా ఇవ్వడంతో వారికి ర్యాంకులు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అర్హత సాధించిన వారికి గురువారం ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. శుక్రవారం జరగబోయే కౌన్సిలింగ్‌లో వారు పాల్గొనవచ్చని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు. 

Updated Date - 2020-10-08T04:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising