ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ హైలైట్స్: పాఠశాల విద్యకు పదివేల కోట్లు

ABN, First Publish Date - 2020-03-08T17:57:58+05:30

ఈ బడ్జెట్‌లో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు కనబడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ బడ్జెట్‌లో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.13వేల కోట్లపైగా నిధులు కేటాయించారు. ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.2,650 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో హరీశ్‌రావు ప్రకటించారు. అలాగే పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1,723 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రజారోగ్యానికి ఎంతో ముఖ్యమైన వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు, రవాణా రంగంలోని ఆర్టీసీకి రూ.1000 కోట్లు, అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు.


మైనార్టీ సంక్షేమానికి రూ.1,518 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు అందించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కోసం రూ. 791 కోట్లు, ఆర్‌అండ్‌బీ కోసం రూ. 3,494 కోట్లు, పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు నిధులు కేటాయించినట్లు ప్రకటించారు.

Updated Date - 2020-03-08T17:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising