ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు భయంతో బావిలో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-04-28T10:03:16+05:30

పుట్టిన రోజున స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. తాటి కల్లు తాగేందుకు వెళ్లిన తమను పోలీసులు దండిస్తారనే భయంతో పరుగెత్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 27: పుట్టిన రోజున స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. తాటి కల్లు తాగేందుకు వెళ్లిన తమను పోలీసులు దండిస్తారనే భయంతో పరుగెత్తి వ్యవసాయ బావిలో పడిపోయాడు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఆడెపు రాజగోపాల్‌(23) తన పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు స్నేహితులతో కలిసి కల్లు తాగేందుకు మల్యాల వెళ్లాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీస్‌ వాహనాన్ని వారు గమనించారు. పోలీసుల కంటపడితే కేసు పెడతారేమోననే భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు. ఈక్రమంలో రాజగోపాల్‌ ప్రమాదవశాత్తు బావిలోపడి మృతి చెందాడు. పుట్టిన రోజు నాడే రాజగోపాల్‌ మృత్యువాత పడటం పలువురిని కలిచి వేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-04-28T10:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising