ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లి రైతు కన్నీరు మున్నీరు!

ABN, First Publish Date - 2020-04-04T10:17:35+05:30

లాక్‌ డౌన్‌లో భాగంగా ఉల్లి మార్కెట్‌ మూత పడటంతో పండించిన ఉల్లిని ఎక్కడికి తీసుకువెళ్లిఅమ్మాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌తో మూతపడ్డ మార్కెట్‌

గద్వాల, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లాక్‌ డౌన్‌లో భాగంగా ఉల్లి మార్కెట్‌ మూత పడటంతో పండించిన ఉల్లిని ఎక్కడికి తీసుకువెళ్లిఅమ్మాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ జిల్లాల తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలోనే ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. ఈ రబీలోనే జిల్లాలో 1200 ఎకరాల్లో ఉల్లి సాగైంది. ప్రస్తుతం రైతులు ఉల్లిని తెంపి పొలాల్లోనే నిల్వ ఉంచారు. కొందరైతే అసలు పంటను ఇంకా తీయలేదు. ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల చొప్పున గద్వాల జిల్లాలోనే లక్షన్నర క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ధర ప్రకారం చూసినా సుమారు రూ.140 కోట్ల విలువైన దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాసిక్‌ నుంచి ఉల్లి వస్తుండడంతో హైదరాబాద్‌ వ్యాపారులు తెలంగాణ ఉల్లికి ప్రాధాన్యం ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిని హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు వాహనదారులు రావడం లేదన్న ఉద్దేశంతో రైతులు పొలాల్లోనే నిల్వ ఉంచుతున్నారు. ఇక, స్థానిక మార్కెట్‌ తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  

Updated Date - 2020-04-04T10:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising