ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలి: కోదండరాం

ABN, First Publish Date - 2020-12-29T18:31:19+05:30

టీచర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవని.. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజేఎస్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీచర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవని.. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించాలని ఇందిరా పార్కు వద్ద టీచర్లు  మంగళవారం ధర్నా తలపెట్టారు. ఈ ధర్నాకు వస్తున్న టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. టీచర్ల అరెస్ట్‌ను కోదండరాం ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లాస్ రూంలో ఉండాల్సిన టీచర్.. పోలీస్ స్టేషన్లో ఉండడమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయ్యాలని డిమాండ్ చేశారు. అనధికారికంగా దాదాపుగా 25 వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. పదోన్నతులు వెంటనే కల్పించాలని చెప్పారు. పీఆర్సీ‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. పీఆర్సీ విషయంలో 2018 నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ఎగ్గొట్టే అవకాశం ఉందని ఆరోపించారు. సీపీఎస్ రద్దు చెయ్యాలి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కోపమే రాని టీచర్లకు ఎసరు పెడుతున్నావ్ కేసీఆర్.. నీ కుర్చీకే ప్రమాదం ఉందని కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-12-29T18:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising