ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డాక్టర్లకు కరోనా: జ్యోత్స్న

ABN, First Publish Date - 2020-06-06T19:16:44+05:30

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డాక్టర్లకు కరోనా: జ్యోత్స్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే డాక్టర్లకు కరోనా సోకుతోందని టీటీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చపట్లు, పూల వర్షం కాదు.. డాక్టర్లకు కావాల్సింది కనీస సౌకర్యాలు అని చెప్పుకొచ్చారు. ప్రజలను కాపాడుతోన్న డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు పీపీఈ కిట్స్, మాస్కులు అందుబాటులో లేవని మండిపడ్డారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎమ్‌లకు టీఏ, డీఏలు అందించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు చేయటం, పీపీఈ, మాస్కులు ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. మంత్రి ఈటెల చెప్తోన్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎటు పోయాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 


తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడ్తోందన్నారు. డాక్టర్లు, నర్సులు ఆరోగ్యం కోసం నియమించిన త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఎటు పోయిందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్ని మాస్కులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన గచ్చిబౌలి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని జ్యోత్స్న దుయ్యబట్టారు. 

Updated Date - 2020-06-06T19:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising