డాక్యుమెంట్ల సమర్పణకు సమయమివ్వాలి: వీరభద్రం
ABN, First Publish Date - 2020-10-01T09:19:22+05:30
ధరణి వెబ్‌సైట్‌కు ప్రజల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్దుష్ట సమయంలో సమర్పించేందుకు గడువు ఇచ్చి సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని సీపీఎం...
ఎల్‌ఆర్‌ఎస్ వద్దే వద్దు: చాడ
హైదరాబాద్, సెప్టెంబర్ 30(ఆంధ్రజ్యోతి): ధరణి వెబ్‌సైట్‌కు ప్రజల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్దుష్ట సమయంలో సమర్పించేందుకు గడువు ఇచ్చి సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సమాచారాన్ని 15 రోజుల్లో సేకరించాని సీఏం ఆదేశించారని గుర్తు చేస్తూ.. ఏఏ డాక్యుమెంట్లు కావాలో ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ప్రజల వద్దకు వెళ్లడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పారు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. అధికారి ేసకరించిన ఆస్తుల వివరాలను గ్రామ పంచాయితీ లేదా మునిసిపాలిటీలో బహిరంగంగా ప్రక టించిన అనంతరం రెండు వారాల్లోగా అభ్యంతరాను ేసకరించాలన్నారు. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాతే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. హడావుడిగా సమాచారం ేసకరించి వెబ్‌సైట్‌లో నమోదు చేసిన పక్షంలో హక్కుదారుకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటుందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం వద్ద సాదా బైనామా దరఖాస్తులు 1096344, పాసుపుస్తకాలో తప్పులు నమోదుపై 265653 దరఖాస్తులు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. వీటికి పట్టా హక్కు కల్పిస్తూ ధరణిలో నమోదు చేయించాలని చెప్పారు. కాగా, పేదలపై భారంగా పరిణమించిన ఎల్‌ఆర్‌ఎ్‌సను ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. అక్టోబర్ 6న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. నూతన వ్యవసాయ చట్టం రైతుల పాలిట ఉరితాడు వంటిదని ఆయన అన్నారు.
Updated Date - 2020-10-01T09:19:22+05:30 IST