ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం: తమ్మినేని

ABN, First Publish Date - 2020-07-14T09:03:51+05:30

కరోనా వైర్‌సను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయని సీపీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈనెల 16న రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల వద్ద సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సుమారు రెండు నెలల లాక్‌డౌన్‌ కాలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. వైరస్‌ సోకిన వారికి సరైన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరవరరావును తక్షణం విడుదల చేసి, వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. . 

Updated Date - 2020-07-14T09:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising