ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్ల మండలంలో ఏ క్షణంలోనైనా....!

ABN, First Publish Date - 2020-06-07T02:31:01+05:30

చర్ల మండలంలో తాళిపేరు మధ్య తరహా ప్రాజెక్టు. ఆ ప్రాంతానికి వరధాయని, జీవధార. ప్రాజెక్టు కింద 24,700 ఎకరాల పంట సాగులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలంలో తాళిపేరు మధ్య తరహా ప్రాజెక్టు. ఆ ప్రాంతానికి వరధాయని, జీవధార. ప్రాజెక్టు కింద 24,700 ఎకరాల పంట సాగులో ఉంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న తాళిపేరు ప్రాజెక్టుపై ఇప్పటి ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ చిన్న చూపు చూస్తోందని చెప్పుకోవాలి.


ఎగువన ఛత్తీస్‌గడ్ సరిహద్దులో కురిసే వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో అన్నింటి కన్నా ముందుగా వరద నీటితో తాళిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. వరద నీటి సామర్థ్యాన్ని బట్టి ప్రాజెక్టు అధికారులు ప్రతి రోజు రెండు లేదా మూడుసార్లు గేట్లను ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడిచిపెడతారు. ఇలా ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లు నీటిని వదిలే క్రమంలో గేట్ల బ్రేకర్లు, రోలర్లు పనిచేయకపోవడం గేట్లు తెరుచుకోవడం లేదు. ఒక్కొక్క గేటుకు 8 రోలర్లు ఉంటాయి. రోలర్ల సహాయంతో గేటును లిఫ్ట్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు 25 గేట్లలో ఎక్కువ గేట్లకు ఇదే సమస్య తలెత్తుతుంది. 


వర్షాకాలంలో వరదల తాకిడికి గేట్లను ఒక్కసారిగా లిఫ్ట్ చేయాలి అంటే కష్టమైన పనే. ప్రాజెక్టు వరద నీటి ప్రవాహ సామర్థ్యం, స్పిల్ లెవల్ 69 మీటర్ల నుంచి 74 మీటర్లు. ప్రాజెక్టు ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువైతే 25 గేట్లను ఎత్తివేయడానికి వీలు కాకపోతే చుట్టు పక్కల ప్రాంతాలకు వరద నీటి ప్రవాహం ఎక్కువై ఎక్కడికక్కడ వరద నీరు చేరి కాలువలకు గండ్లు పడి భారీ నష్టం జరుగుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-06-07T02:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising