మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి
ABN, First Publish Date - 2020-12-11T09:03:41+05:30
‘‘గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? గుడ్డి ద్వేశం ఎందుకు?’’ వంటి పదాలను ఓ ఇంటర్వ్యూలో వాడి దివ్యాంగుల
హెచ్చార్సీలో టీపీసీసీ దివ్యాంగుల విభాగం ఫిర్యాదు
హైదరాబాద్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? గుడ్డి ద్వేశం ఎందుకు?’’ వంటి పదాలను ఓ ఇంటర్వ్యూలో వాడి దివ్యాంగుల మనోభావాలను కించపరిచినందుకు మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన ఫిర్యాదును కమిషన్ స్వీకరించిందని, శుక్రవారం దీనిపై విచారణ చేపట్టనుందని చెప్పారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కేటీఆర్ వికలాంగుల హక్కులు, చట్టాలను మర్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
Updated Date - 2020-12-11T09:03:41+05:30 IST