ఇద్దరు రైతన్నల ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-08-22T08:48:10+05:30
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరు రైతన్నలు ఆత్మహత్య చేసు కున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరు,
రామాయంపేట/జగదేవ్‌పూర్, ఆగస్టు 21: మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరు రైతన్నలు ఆత్మహత్య చేసు కున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరు, అప్పుల బాధతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మం డలం వెంకటాపురానికిచెందిన రైతు ఇసాక్(45)తండ్రి కన్నుమూయడంతో భూమిని తన పేరిట మార్పించుకునేందు కు మూడేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగారు. అతడి విజ్ఞప్తిని పట్టించుకోకపోగా ఆ భూ మి మరెవరి పేరిటో పట్టా అయిందని చెప్పడంతో భూమిని కోల్పోతానేమోనన్న ఆందోళనతో ఉరివేసుకున్నాడు. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన ఆరె రమేశ్(37)కు ఉన్న ఎకరం భూమి కాళేశ్వరం ప్రాజెక్టులో కోల్పోయారు. దీంతో గత మూడేళ్ల నుంచి ఎనిమిది ఎకరాల భూమిని కౌలుకు సాగు చేస్తున్నారు. పంటలు సరిగ్గా పండకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరుకున్నాయి. అప్పుల భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Updated Date - 2020-08-22T08:48:10+05:30 IST