‘సిట్’ విచారణ వివరాలు సమర్పించండి
ABN, First Publish Date - 2020-11-13T09:23:15+05:30
డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
‘డ్రగ్స్ కేసు’లో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైద రాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేరంలో అంతర్జాతీయ మూలాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ సరిపోదని, కేంద్ర విచారణ సంస్థలైన సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను విచారించిన ధర్మాసనం.. ఈమేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ చేపట్టిన విచారణకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేసింది.
Updated Date - 2020-11-13T09:23:15+05:30 IST