ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట

ABN, First Publish Date - 2020-12-29T07:55:21+05:30

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించకపోతే పోరుబాట పడతామని న్యాయశాఖ ఉద్యోగులు హెచ్చరించారు. అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల వర్చువల్‌ సమావేశం సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల హెచ్చరిక


హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించకపోతే పోరుబాట పడతామని న్యాయశాఖ ఉద్యోగులు హెచ్చరించారు. అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల వర్చువల్‌ సమావేశం సోమవారం జరిగింది. ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాల న్యాయశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. న్యాయశాఖ ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు 2009 జూలైలో ఇచ్చిన ఆదేశాల్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటి వరకు జీవోల రూపంలో ఇవ్వలేదని లక్ష్మారెడ్డి అన్నారు. సుప్రీం ఆదేశాలకు అనుకూలంగా మరో రెండు నెలల్లో ప్రభుత్వాలు జీవోలు జారీ చేయాలని, లేకపోతే పోరుబాట తప్పదని ఆయన స్పష్టం చేశారు. ముందుగా దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల ముందు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోతే 12 లక్షల మంది న్యాయ శాఖ ఉద్యోగులు కోర్టుల పనితీరు స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కామన్‌ పోస్టులు, కామన్‌ పే విధానం అమల్లో ఉందని అదే తరహాలో న్యాయశాఖలోనూ ఉండాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-29T07:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising