ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలక్ర్టిక్‌ ఆటోల కొనుగోలుకు ‘స్త్రీనిధి’ రుణాలు

ABN, First Publish Date - 2020-09-25T09:18:13+05:30

ప్రజా రవాణా, సరుకు రవాణాకు వినియోగించే ఎలక్ర్టిక్‌ ఆటోల కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయక సభ్యులకు రుణం అందించాలని స్త్రీనిధి బ్యాంకు నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యాంకు పాలకమండలి నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణా, సరుకు రవాణాకు వినియోగించే ఎలక్ర్టిక్‌ ఆటోల కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయక సభ్యులకు రుణం అందించాలని స్త్రీనిధి బ్యాంకు నిర్ణయించింది. కనిష్ఠంగా జిల్లాకు 30 చొప్పున మొత్తం 1000 ఆటోలకు ఈ రుణాలు అందజేయాలని తీర్మానించింది. స్త్రీనిధి బ్యాంకు పాలకవర్గ సమావేశం గురువారం సంస్థ కార్యాలయంలో జరిగింది. ముర్రా, సంకర జాతి పాడి పశువుల కొనుగోలుకు రూ. 75 వేల చొప్పున 50 వేల యూనిట్లకు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను అద్దెకు ఇచ్చే కేంద్రాలను నెలకొల్పే సమాఖ్యలకు రూ. 25 లక్షలు రుణం అందించాలని పాలకవర్గం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సభ్యులకు అధిక మొత్తంలో రుణాలు అందించాలని ఈ సమావేశం తీర్మానించింది.


Updated Date - 2020-09-25T09:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising