ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణపై కేబినెట్ కార్యదర్శికి రాష్ట్ర సీఎస్ నివేదన

ABN, First Publish Date - 2020-05-28T21:06:39+05:30

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రత్యేకించి కంటైన్‌మెంట్ జోన్‌లలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రత్యేకించి కంటైన్‌మెంట్ జోన్‌లలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు. 


గురువారం క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా... కోవిడ్-19  కి సంబంధించి ప్రజారోగ్య స్పందనపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వైరస్ నియంత్రణలో ఉందని, రాష్ట్రానికి సరిపడ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు తదితరాలను సమకూర్చకున్నామని, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, లక్ష కేసులకు చికిత్సనందించే విధంగా సిద్ధంగా ఉన్నామని కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, సీసీఎల్‌ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T21:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising