కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2020-10-04T09:35:37+05:30
కరోనా కట్టడికి వైద్యాధికారులు పకడ్బందీ తీసుకోవాలని జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ సూచించారు
వైద్యాధికారులకు సూచించిన జడ్పీ చైర్మన్
హన్మకొండ టౌన్, అక్టోబరు 3: కరోనా కట్టడికి వైద్యాధికారులు పకడ్బందీ తీసుకోవాలని జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ సూచించారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులు, ప్రణాళిక మరియు ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల నివేదికలను అధికారులు చదివి వినిపించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సేవలందిస్తోందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో సీఈవో ప్రసూనారాణి, వైస్‌చైర్మన్ శ్రీరాములు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా శనివారం హైదరాబాద్‌లో సమావేశం ఉండడంతో ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు.
Updated Date - 2020-10-04T09:35:37+05:30 IST