ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనంగానే 7 అవార్డులు

ABN, First Publish Date - 2020-06-18T09:51:52+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, పని తీరుకు జాతీయ స్థాయిలో ఏడు అవార్డులు రావడమే నిదర్శనమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ఉపాధి హామీలో తెలంగాణ నం.1: ఎర్రబెల్లి 

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, పని తీరుకు జాతీయ స్థాయిలో ఏడు అవార్డులు రావడమే నిదర్శనమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ర్టానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  పల్లెప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయని, పారిశుధ్యం దిగ్విజయమైందన్నారు. ఫలితంగానే కరోనా వైరస్‌ కూడా పల్లెలకు సోకలేదని చెప్పారు. అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరిగిందన్నారు. హరిత హారంలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు.


మిషన్‌ భగీరథతో మంచినీటి సమస్య కూడా తీరిందని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవడంలోను మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని మంత్రి  తెలిపారు. ఈ ఏడాది 13 కోట్ల పనిదినాలులక్ష్యం కాగా ఇప్పటికే 9.81 కోట్ల పని దినాలను పూర్తి చేసుకున్నామన్నారు. పనిదినాల లక్ష్యంలో దేశ సగటు 26.3 కాగా తెలంగాణలో 75.5 శాతంతో తెలంగాణ ముందుండగా, 53.5 శాతంతో ఛత్తీ్‌సగఢ్‌ ద్వితీయ స్థానంలో నిలిచిందని చెప్పారు.  

Updated Date - 2020-06-18T09:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising