ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటి ఎకరాల మాగాణం

ABN, First Publish Date - 2020-08-22T08:53:05+05:30

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయ్యింది. వానాకాలం పంటల సాగులో కోటీ 25 లక్షల ఎకరాల మైలురాయిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీఎంవోకు రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయ్యింది. వానాకాలం పంటల సాగులో కోటీ 25 లక్షల ఎకరాల మైలురాయిని దాటింది. ప్రభుత్వం తయారుచేసిన ప్రణాళిక ప్రకారం రైతులు పంటలు సాగు చేశారు. చరిత్రలో మొట్టమొదటిసారి రైతులు ఇలాంటి సాగు చేశారని చెప్పుకోవ చ్చు. నియంత్రిత సాగు పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌ నుంచే అమల్లోకి తీసుకురాగా, అందుకు అనుగుణంగా రైతులు స్పందించటం, 90-110 శాతం మధ్య పంటల విస్తీర్ణం లెక్కలు సరితూగటం గమనార్హం. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి నివేదికను శుక్రవారం సీఎంవోకు సమర్పించారు. ఈ వానాకాలం మొదలుకావటానికి కొన్ని రోజుల ముందే వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. 41.77 లక్షల ఎకరాల్లో వరి, 60.16 లక్షల ఎకరాల్లో పత్తి, 4.68 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌, 12.31 లక్షల ఎకరాల్లో కంది విస్తీర్ణాన్ని ప్రతిపాదించారు. పెసర, జొన్న, మినుము, వేరుశనగ, ఆముదం, చెరుకు తదితర పంటలు కలిపి 1,25,45,061 ఎకరాల్లో సాగుచేయలని రైతులకు షరతులు పెట్టారు. జూన్‌లో సాగు ప్రారంభమైంది. సాగుచేసే సమయం దాదాపుగా పూర్తి కావస్తున్న దశలో వ్యవసాయశాఖ నియంత్రిత సాగు ప్రణాళిక, వాస్తవ సాగులెక్కలను పోలుస్తూ రూపొందించిన నివేదికను వెల్లడించింది.


ప్రణాళిక ప్రకారం పంటలు

రాష్ట్రంలో పత్తి విస్తీర్ణం పెంచాలని, 60 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం సూ చిస్తే... 58.81లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. 41.77 లక్షల ఎకరా ల్లో వరిని ప్రతిపాదిస్తే  45.73 లక్షల ఎకరాల్లో రైతులు ఆ పంట వేశారు. 1 కోటి 25 లక్షల ఎకరాల పైచిలుకు విస్తీర్ణానికి సాగు ప్రణాళిక చేస్తే... అంతే విస్తీర్ణంలో(1,25,13,332 ఎకరాల్లో) ఇప్పటివరకు పంటలు సాగు కావటం మరో విశేషం. ఒక్క మొక్కజొన్న విషయంలో లెక్కలు కొంత తేడా వచ్చాయి. ప్రభుత్వం వద్దన్నప్పటికీ 2 లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. నిజామాబాద్‌, వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలు 99 శాతం, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలు 100 శాతం, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు 101 శాతం, సిద్దిపేట 102 శాతం, వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌ జిల్లాలు 104 శాతం, మెదక్‌, భద్రాద్రి కొత్తగూడెం 105 శాతం పంటలు సాగుచేయటం విశేషం.

Updated Date - 2020-08-22T08:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising