ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గరుడ స్క్వాడ్‌’ కు శిక్షణ ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-22T06:56:50+05:30

ప్రముఖుల భద్రతపై ‘డేగ కన్ను’ వేసేందుకు రంగంలోకి దింపుతున్న ‘గరుడ స్క్వాడ్‌’కు శిక్షణ ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖుల భద్రతపై ‘డేగ కన్ను’ వేసేందుకు రంగంలోకి దింపుతున్న ‘గరుడ స్క్వాడ్‌’కు శిక్షణ ప్రారంభమైంది. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ) లో గరుడ స్క్వాడ్‌కు నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖుల పర్యటనల సమయంలో నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు ఉంటేగుర్తించి వాటిని ధ్వంసం చేసేలా శిక్షణ ఇస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు సైన్యం మాత్రమే గరుడ స్క్వాడ్‌ను ఉపయోగిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలోనూ ఈ స్క్వాడ్‌ త్వరలో వాడుకలోకి రానుంది.


కాగా ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఇప్పటికే మావోయిస్టు యాక్షన్‌ టీంలు రంగంలోకి దిగాయనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ముఖ్య నేతలు, ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా గరుడ స్క్వాడ్‌ను వినియోగించనున్నారు. అంతేకాకుండా సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికల్ని గుర్తించేందుకూ ఈ స్క్వాడ్‌ సేవల్ని పోలీసులు వినియోగించనున్నారు.


Updated Date - 2020-10-22T06:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising