ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు ప్రపంచ రికార్డులు శ్రీచైతన్య సొంతం

ABN, First Publish Date - 2020-02-22T08:15:24+05:30

తమ విద్యా సంస్థలు రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాయని శ్రీచైతన్య అధినేత బీఎస్‌ రావు తెలిపారు. శ్రీచైతన్య వరల్డ్‌ రికార్డ్స్‌ ఫెస్టివల్‌-2019 సందర్భంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): తమ విద్యా సంస్థలు రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాయని శ్రీచైతన్య అధినేత బీఎస్‌ రావు తెలిపారు. శ్రీచైతన్య వరల్డ్‌ రికార్డ్స్‌ ఫెస్టివల్‌-2019 సందర్భంగా ఇండియా రికార్డ్స్‌ అకాడమీ, ఎలైట్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ఏషియన్‌ రికార్డ్స్‌ అకాడమీ సమక్షంలో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు తెలిపారు. అవార్డుల సర్టిఫికెట్లను విద్యార్థులకు శుక్రవారం ఆయన విజయవాడలో అందించారు. ఒకే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక మంది హాజరై ఒకేసారి స్పోర్ట్స్‌ డ్రిల్‌ ప్రదర్శించడంలో, ఒకే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక మంది హాజరై ఒకేసారి యోగాసనాలను ప్రదర్శించడంలో ప్రపంచ రికార్డులను సృష్టించారన్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు ఇటు అకాడమిక్‌లోనూ అటు నాన్‌ అకాడమిక్‌లోనూ ప్రపంచ రికార్డులు నెలకొల్పుతూ నం.1 విద్యాసంస్థగా ఉందన్నారు. ఏడు రాష్ట్రాల్లోని 390 స్కూళ్ల నుంచి 1,32,121 మంది శ్రీచైతన్య విద్యార్థులు పాల్గొని విజయవంతంగా వరల్డ్‌ రికార్డును నెలకొల్పారని రికార్డు అకాడమీ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-02-22T08:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising