ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖులకు చుక్కెదురు

ABN, First Publish Date - 2020-12-05T09:25:43+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రముఖులకు చుక్కెదురైంది. అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టున్న నేతల భార్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య పరాజయం

 కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే కూతురు ఓటమిపాలు

 నాయిని అల్లుడు, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ సోదరుడు..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రముఖులకు చుక్కెదురైంది. అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టున్న నేతల భార్య, కూతురు, అల్లుడు ఇలా బంధువులు ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి భార్య బేతి స్వప్న హబ్సిగూడలో పరాజయం పొందారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత (కవాడిగూడ-టీఆర్‌ఎస్‌), ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌  మరదలు పద్మానరేశ్‌ (గాంధీనగర్‌-టీఆర్‌ఎస్‌), మాజీ హోంమంత్రి, నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివా్‌సరెడ్డి (రాంనగర్‌-టీఆర్‌ఎస్‌), రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ తమ్ముడు ప్రేమ్‌దా్‌సగౌడ్‌ (మైలార్‌దేవ్‌పల్లి-టీఆర్‌ఎస్‌), కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ తమ్ముడు శ్రీనివా్‌సగౌడ్‌ (గాజులరామారం-కాంగ్రె్‌స)కు పరాభవం తప్పలేదు.


  స్వప్న, లాస్యనందిత, శ్రీనివా్‌సరెడ్డి, పద్మానరేశ్‌ 2016 ఎన్నికల్లో గెలిచారు. పద్మానరేశ్‌ తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముమ్మర ప్రచారం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రేమ్‌దా్‌సగౌడ్‌ తొలిసారి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి పరాజయం పొందారు. ఈ డివిజన్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌, టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత శ్రీనివా్‌సరెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. 


ఆ నలుగురు గెలిచారు. 

నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య బొంతు శ్రీదేవి యాదవ్‌ చర్లపల్లి డివిజన్‌ నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ బోరబండ లో, మాజీ మంత్రి పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి ఖైరతాబాద్‌, ఎంపీ కె. కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్‌ నుంచి రెండోసారి విజయం సాధించారు.


ఓడిన 35 మంది సిటింగ్‌లు

మెజారిటీ డివిజన్లలో సిటింగ్‌లను బరిలోకి దించిన టీఆర్‌ఎ్‌సకు ఊహించని షాక్‌ తగిలింది. 2016లో 99 మంది పార్టీ అభ్యర్థులు విజేతలుగా నిలవగా.. వారిలో 72 మందికి మరోసారి అవకాశం ఇవ్వగా.. 35 మంది ఓటమి పాలయ్యారు. చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉండటం వల్లే ఓడిపోయారన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. 


Updated Date - 2020-12-05T09:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising