ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక మాసం సందర్భంగా పర్యాటక శాఖ ప్యాకేజి

ABN, First Publish Date - 2020-12-06T20:50:16+05:30

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల, పర్యాటకుల సౌకర్యం కోసం ఆహ్లాదకరమైన వాతావరణం లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల, పర్యాటకుల సౌకర్యం కోసం ఆహ్లాదకరమైన వాతావరణం లో , పాపికొండలను మైమరిపించే విధంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత గల కృష్ణ నదిలో అత్యధునాతన భద్రత కలిగిన క్రూజ్ లో పర్యాటకులు ప్రయాణించేందుకు సిద్ధం చేసింది. నామమాత్రపు టూర్ ధరలతో హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ జలాశయం నుండి శ్రీశైలం, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్ వరకు  సాగే టూర్ తో దేవాలయం దర్శనము, భోజన సదుపాయం, ఈగల పెంటలో ఉన్న టూరిజం హోటల్ బస వరకు సిద్ధం చేసింది.


ఈ టూర్ లో భాగంగా  రాను పోను పెద్దలకు రూ. లు 3499, పిల్లలకు రూ. లు 2800  వీలుగా ప్యాకేజి ని రూపొందించామని అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్నుం డి శ్రీశైలం, నాగార్జున సాగర్, హైదరాబాద్ ల మీదుగా సాగే మరో టూర్ ప్యాకెజి లో పెద్దలకు 3499/- పిల్లలకు 2800/- రూపాయల తో ఈ ప్యాకేజీ ని పర్యాటకులకు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణలు ఉన్నాయి. అలాగే కృష్ణానది పరిసరాల్లో ని అందాలు పాపికొండలను తలపించేలా ఉంటాయన్నారు. పర్యాటకులు ఈ అవకాశం ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.


తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సినిమా షూటింగ్ లకు సైతం అనుమతించారు. షూటింగ్ ల  కోసం విదేశాల కు వెళ్లే పరిస్థితి లేనందున దర్శకులు, ప్రొడ్యూసర్ లు రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాల్లో సినిమాలు తీసేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-12-06T20:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising