ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహకార బ్యాంకులు రైతులకు చేయూతనివ్వాలి- స్పీకర్‌ పోచారం

ABN, First Publish Date - 2020-10-19T01:01:04+05:30

సహకారం బ్యాంకులు రైతులకు చేయూతనిస్తూ వారికి అభ్యున్నదికి పాటు పడాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌: సహకారం బ్యాంకులు రైతులకు చేయూతనిస్తూ వారికి అభ్యున్నదికి పాటు పడాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) 98వ వార్షిక మహాజనభకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం కూడా 1977లో సహకార బ్యాంకు ఛైర్మన్‌గా ప్రారంభమైందన్నారు. ఇది తాను పనిచేసిన బ్యాంకు కావడం గర్వకారణంగా ఉందన్నారు. రైతులకు సమీపం నుంచి అత్యున్నత సేవలు అందించే ఏకైక బ్యాంకు సహకార బ్యాంకని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు ఎంతో పటిష్టమైందని ప్రశంసించారు.


బ్యాంకు పాలక వర్గాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంతో పాటు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. పాలక వర్గం కష్టపడి బ్యాంకు పేరును నిలబెట్టాలని కోరారు. రైతులకు అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ఛైర్మన్‌ కోడూరు రవీందర్‌ రావు, నిజామాబాద్‌ రూరల్‌, ఎల్లారెడ్డి, జుక్కల్‌ శాసన సభ్యులు బాజిరెడ్డిగోవర్ధన్‌, జాజుల సురేందర్‌, హన్మంత్‌షిండే ,ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి,డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T01:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising