ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-11-21T10:16:38+05:30

మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా ఖననం చేసేందుకు జేసీబీని సమకూరుస్తామని చెప్పిన పోలీసులు మూడు గంటలు దాటినా పంపకపోవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన

-  ఖననం చేయడానికి జేసీబీని పంపలేదంటూ అధికారులపై మండిపాటు


వాజేడు, నవంబరు 20 : కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు అధికారులు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి (48) కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ వ్యక్తి మానసిక ఆందోళనకు గురై శారీరకంగా బలహీనపడ్డాడు. పది, పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా  శ్వాసకోశ సమస్యను ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం వెంకటాపురంలో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యం కోసం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.


మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా ఖననం చేసేందుకు జేసీబీని సమకూరుస్తామని చెప్పిన పోలీసులు మూడు గంటలు దాటినా పంపకపోవడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతదేహంతో 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డుపై టైర్లను దహనం చేసి బైఠాయించారు. మృతుడు దళితుడు కావడం వల్లే అంత్యక్రియలకు జేసీబీని పంపడం లేదని మండిపడ్డారు. ఎస్సై, సర్పంచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న ఎస్సై కొప్పుల తిరుపతిరావు వెంకటాపురం నుంచి జేసీబీని రప్పించడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు శాంతించి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-11-21T10:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising