ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికులకు ‘స్నేహ హస్తాలు’

ABN, First Publish Date - 2020-05-26T02:45:35+05:30

దేశాన్ని నిర్మాణంలో ప్రధాన భాగమైన వలస కార్మికులు రహదారులపై రక్తమోడుతున్నారు. నిజానికి వీళ్లు నిజమైన సైనికులు. వీళ్లే మన దేశ ఆత్మ. వారికి అనుకోని ఆపద ఎదురైంది. అయితే వారికి మన నుంచి సరైన సహకారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు ‘స్నేహ హస్తాలు’ అనే స్వచ్ఛంద సంస్థ ఆపన్న హస్తం అందించింది. వలస కార్మికులకు వీలైనంతలో నిత్యవసర వస్తువులను సమకూర్చేందుకు 50 వేల రూపాయలను అందించారు. ఆంధ్రజ్యోతితో పాటు వివిధ పత్రికల్లో ప్రచురితమైన చిత్రాలకు స్పందించిన ఆ సంస్థ.. వలస కార్మికులకు ఏదైనా సాయం చేయలనే సంకల్పంతో ఇంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది.


‘‘దేశాన్ని నిర్మాణంలో ప్రధాన భాగమైన వలస కార్మికులు రహదారులపై రక్తమోడుతున్నారు. నిజానికి వీళ్లు నిజమైన సైనికులు. వీళ్లే మన దేశ ఆత్మ. వారికి అనుకోని ఆపద ఎదురైంది. అయితే వారికి మన నుంచి సరైన సహకారం అందడం లేదు. అందుకే మేము ‘స్టెప్ ఇన్ మై షూస్’ అనే కార్యక్రమం ద్వారా వారికి ఏదైనా చేయాలని అనుకున్నాం. దేశంలోని ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-16 జాతీయ రహదారుల వెంటన ఉన్న వలస కార్మికులకు చెప్పులు, బూట్లు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. ఓ జర్నిలిస్టు మిత్రుడితో (ఫొటోగ్రాఫర్) కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వలస కార్మికుల బాధను పంచుకుందాం. రేపటి మన భవిష్యత్‌ తరాలకు వాళ్లు ఎంత ముఖ్యమో తెలిసేలా చెప్పే ప్రయత్నం చేద్దాం’’ అని స్నేహ హస్తాలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-26T02:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising