ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు

ABN, First Publish Date - 2020-04-02T20:58:33+05:30

జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు ఒక్కరోజే నమోదు కావడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలో తొలిసారిగా ఆరు పాజిటీవ్ కేసులు ఒక్కరోజే నమోదు కావడంతో కలకలం రేపుతోంది. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన నల్గొండ పట్టణానికి చెందిన ఐదుగురుకి, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక మహిళకు పాజిటీవ్ అని తేలింది. ఢిల్లీకి వెళ్లివచ్చిన మరికొందరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇవాళ విదేశాలనుంచి వచ్చినవారు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిపై దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం విదేశాలనుంచి వచ్చినవారు 399 మంది ఉన్నారని, వారంతా క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేశారని తెలిపారు. 


ఈ దశలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 45 మంది లిస్టు తనవద్ద ఉందని కొండలరావు తెలిపారు. వారికి పరీక్షలు నిర్వహించి హైదరాబాద్, ఫీవర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. అందులో 34 మందికి నెగిటీవ్ వచ్చిందని.. హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. మరో ఆరుగురికి పాజిటీవ్ వచ్చిందని.. వారిని పీవర్ ఆస్పత్రిలో ఉంచామన్నారు. వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కొండలరావు చెప్పారు.

Updated Date - 2020-04-02T20:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising