ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ పట్టించుకోని జనంపై శివాలెత్తిన కలెక్టర్

ABN, First Publish Date - 2020-03-23T20:00:09+05:30

తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మార్చి 31 వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మార్చి 31 వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ..ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పక్క ఫొటోలో ఉన్న వ్యక్తి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా జనం రోడ్లపైకి రావడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వారిని ఆపి మరీ క్లాస్ తీసుకుంటున్నారు. ఏమాత్రం టెన్షన్ లేకుండా యథేచ్ఛగా రోడ్లపైకి జనం రావడాన్ని తప్పుబట్టారు. వాహనాలను వెనక్కి పంపించే క్రమంలో వాహనదారులపై కృష్ణ భాస్కర్ శివాలెత్తారు. రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేయిస్తున్నారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే.. వారిని అరెస్ట్ కూడా చేయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.   

Updated Date - 2020-03-23T20:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising