ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగూర్ ప్రాజెక్టుకు జలకళ..

ABN, First Publish Date - 2020-10-07T20:10:18+05:30

సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. మూడేళ్ల తర్వాత నీటితో కలకళలాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి జిల్లా: సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. మూడేళ్ల తర్వాత నీటితో కలకళలాడుతోంది. ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీరు చేరింది. మరో 5 టీఎంసీల నీరు వస్తే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పర్యాటకుల సందడి పెరిగింది. పెద్ద సంఖ్యలో జనం సింగూరును సందర్శిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వెళుతున్నారు. అయితే స్థానికంగా వసతి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు దగ్గర ఓ పార్కును నిర్మించినా వరద నీటికి అది పూర్తిగా ధ్వంసమైంది. దీంతో సింగూరు పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-07T20:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising