ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పదంగా మారిన సింగరేణి కరోనా విరాళం

ABN, First Publish Date - 2020-03-29T17:04:32+05:30

కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు సింగరేణి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల : కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు సింగరేణి ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణిలోని సుమారు 2,400 మంది అధికారుల ఒక రోజు వేతనాల మొత్తం కోటి రూపాయలతో పాటు 47 వేల మంది కార్మికుల ఒక రోజు వేతనం రూ. 7.50 కోట్లు కలిపి రూ. 8.50 కోట్లను కేసీఆర్‌కు అందజేయనున్నారు. 


వివాదమవుతున్న విరాళం!

అయితే ఈ ప్రకటన తీవ్ర వివాదాస్పదమవుతోంది. విరాళం ఎలా ప్రకటిస్తారు..? అంటూ కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యంతరం తెలుపుతున్నారు. కరోనా నేపథ్యంలో తమకు సెలవులు ఇవ్వకుండా.. పనులు చేయిస్తూ ఒక రోజు వేతనం ఎలా ప్రకటిస్తారని ఉన్నతాధికారులను  ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరోజు వేతనాన్ని తాము విరాళంగా ఇచ్చేందుకు సుముఖంగా లేమని యాజమాన్యానికి లేఖలు రాస్తున్నారు. ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? కార్మికుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


లాక్‌డౌన్‌ ప్రకటించాలి!

ఇదిలా ఉంటే.. సింగరేణి బొగ్గు గనుల్లోనూ లాక్‌డౌన్‌ ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌ ఆయన లేఖ రాశారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు వెంటిలేషన్‌ ఉండదని, వారిలో ఏ ఒక్కరికీ కరోనా వైరస్‌ వ్యాపించినా.. అందరికీ అంటుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-29T17:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising