ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కుళ్లిపోతున్న మృతదేహాలు

ABN, First Publish Date - 2020-06-03T23:47:42+05:30

సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. రామ గుండం డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో మందుగుండు పేలి.. నలుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. రామ గుండం డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో మందుగుండు పేలి.. నలుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. అయితే మృతుల పరిహారం విషయంతో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం జరుగుతోంది. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని మృతుల బంధువులు, కార్మిక సంఘాలు భీష్మించుకూర్చున్నాయి. అయితే సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇంకా స్పష్టత రాలేదు. కోటి రూపాయలు ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల డిమాండ్‌ను సింగరేణి యాజమాన్యం, మహాలక్ష్మి కంపెనీ అంగీకరించలేదు. ఓపెన్ కాస్ట్ ప్రమాదం జరిగి 36 గంటలు గడుస్తున్నా ఇంకా ఏరియా ఆస్పత్రిలోనే మృతదేహాలు ఉన్నాయి. పరిహారంపై కార్మిక సంఘాలు, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.


రామగుండం డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో మందుగుండు పేలి.. నలుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఉదయం 10:25 గంటల వరకు 32 రంధ్రాలు పూర్తి కాగా, 33వ రంధ్రం తవ్వి అందులో వాహనంతో స్లరీ ఎక్స్‌ప్లోజివ్‌ నింపిన తర్వాత డిటోనేటర్‌ అమరుస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో గోదావరిఖనికి చెందిన బండారి ప్రవీణ్‌కుమార్‌(38), కమాన్‌పూర్‌కు చెందిన బిల్ల రాజేశం(42), బండారి అంజయ్య(41), మహారాష్ట్ర మర్కొండకు చెందిన ఎస్‌.రమేష్‌(28) అక్కడిక్కడే మృతి చెందారు. పేలుడు ధాటికి వారి శరీరాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. కమాన్‌పూర్‌ మండలం జూలపల్లికి చెందిన బండి శంకర్‌, శాలపల్లికి చెందిన కుందారపు వెంకటేశం, అదే మండలానికి చెందిన భీమయ్య తీవ్రంగా గాయపడగా వారిని గోదావరిఖనిలోని సింగరేణి సంస్థ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-06-03T23:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising