రక్షణ చర్యలపై సింగరేణి సీఎండీ సమీక్ష
ABN, First Publish Date - 2020-12-30T04:05:14+05:30
రక్షణ చర్యలపై సింగరేణి సీఎండీ సమీక్ష
కాకతీయఖని, డిసెంబరు 29: భూపాలపల్లి సింగరేణి గనుల్లో చేపడుతున్న రక్షణ చర్యలను సీఎండీ ఎన్.శ్రీధర్ మంగళవారం సమీక్షిం చారు. డీజీఎంఎస్ టాకేధార్ అధ్యక్షతన డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్‌రావు, బలరాంతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 46వ త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి గనులలో చేపడుతున్న రక్షణ చర్యలు, కాంట్రాక్టు కార్మికులకు జాగ్రత్తలు, గనుల్లో సరైన వెంటిలేషన్ ఏర్పాట్లు, యువ ఉద్యోగులకు శిక్షణ తదితర అంశాలపై చర్చింనట్లు ఏరియా అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం నిరీక్షణ్‌రాజ్, ఎస్‌వో టు జీఎం విజయప్రసాద్, రమణ, జాన్ ఆనంద్, సత్యనారాయణ, ఆయా గనుల మేనేజర్లు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:05:14+05:30 IST