ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులను తరలిస్తున్న 8 అంబులెన్సుల సీజ్‌

ABN, First Publish Date - 2020-03-24T09:08:29+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలో బంద్‌ను పాటించకుండా ప్రయాణికులను తరలిస్తున్న 8 అంబులెన్సులను, రోడ్లపై తిరుగుతున్న మరో 135 ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లను రవాణా శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 135 ఇతర వాహనాలు కూడా

హైదరాబాద్‌ సిటీ/కోదాడ రూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలో బంద్‌ను పాటించకుండా ప్రయాణికులను తరలిస్తున్న 8 అంబులెన్సులను, రోడ్లపై తిరుగుతున్న మరో 135 ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లను రవాణా శాఖ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. బస్‌ సర్వీసులను నిలిపివేయడంతో కొందరు అధిక చార్జీలు వసూలు చేసి అంబులెన్సులలో ప్రయాణికులను తరలిస్తున్నారు.


హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఒక్కొక్కరి నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ప్రయాణికులను తరలిస్తున్న ఐదు అంబులెన్సులను రవాణా శాఖ అఽధికారులు  సీజ్‌ చేశారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో  135 ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లతోపాటు 3 అంబులెన్సులను రవాణా శాఖ అఽధికారులు సీజ్‌ చేశారు. హైదరాబాద్‌లో బైక్‌లు, 1058, త్రిచక్రవాహనాలు 948, ఫోర్‌ వీలర్లు 429, ఇతర వాహనాలను 45 స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-03-24T09:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising