ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రావణి కేసులో వీడుతున్న చిక్కుముడులు

ABN, First Publish Date - 2020-09-14T18:19:33+05:30

టీవీ నటి శ్రావణి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీవీ నటి శ్రావణి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణ వేధింపులు భరించలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డిని పోలీసులు గత మూడు రోజులుగా విచారిస్తున్నారు. మరో నిందితుడు సాయి కృష్ణను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.


సినిమాల్లో నటించాలనే కోరికతో 8 ఏళ్ల క్రితం శ్రావణి కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు తన స్నేహితురాలి ద్వారా అనంతపురానికి చెందిన సాయి కృష్ణ పరిచయం అయ్యాడు. సినీ పరిశ్రమంలో తనకున్న పరిచయాలతో శ్రావణిని అశోక్ రెడ్డికి పరిచయం చేశాడు. ‘ప్రేమతో మీ కార్తిక్’ అనే సినిమాలో శ్రావణికి సాయి కృష్ణ చిన్న పాత్ర ఇప్పించాడు. ఇలా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రావణికి టీవీ సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి. ఆర్థికంగా కొంత స్థిరపడడంతో శ్రావణి తల్లిదండ్రులు, సోదరుడు కూడా హైదరాబాద్ వచ్చారు. శ్రావణి కుటుంబసభ్యులతో కూడా సాయి పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఇంటికి వచ్చిపోతుండేవాడు.


ఏడాది క్రితం టిక్ టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్‌తో పరిచయం అయింది. తమ ప్రాంతం వాడే కావడంతో ఆమె అతనితో చనువుగా ఉండేది. తాను ఉంటున్న ఇంట్లో కొద్ది రోజులు ఆశ్రయం ఇచ్చింది. అప్పటి నుంచి దేవరాజ్, సాయిల మధ్య విబేధాలు తలెత్తాయి. గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో శ్రావణి ఇంటి నుంచి దేవరాజ్ వెళ్లిపోయాడు. ఈ నెల 7న పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌లో శ్రావణి, దేవరాజ్ ఉన్నట్లు తెలుసుకున్న సాయికృష్ణ అక్కడికి వెళ్లి.. దేవరాజ్‌తో గొడవపడి శ్రావణిని తీసుకుని ఆమె ఇంట్లో దిగబెట్టాడు. ఆ రోజు రాత్రి కుటుంబసభ్యులు, సాయికృష్ణ తనను వేధించారని, కొట్టారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రావణి అంటున్న వీడియో రికార్డును దేవరాజ్ పోలీసులకు అందజేశాడు. దేవరాజ్, సాయికృష్ణను విచారించిన పోలీసులు.. శ్రావణి ఆత్మహత్యకు ఇద్దరూ కారణమనే నిర్ధారణకు వచ్చారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత అశోక్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు.

Updated Date - 2020-09-14T18:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising