ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యనగరం వరద బాధితులకు అండగా సేవాభారతి

ABN, First Publish Date - 2020-10-15T21:57:02+05:30

నగరంలో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముంపుకు గురైన ప్రాంతాల్లో సేవా భారతి సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముంపుకు గురైన ప్రాంతాల్లో సేవా భారతి సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  సికింద్రాబాద్, మల్కాజిగిరి, లాలాపేట్, ఇందిరానగర్ బస్తీ, కుకట్‌పల్లి, ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, ఉప్పుగూడ తదితర ప్రాంతాల్లో సేవా భారతి కార్యకర్తలు తక్షణ సేవలు అందించారు.


నిత్యవసర వస్తువులు, ఆహార పొట్లాలను, బిస్కట్లు పంపిణీ చేశారు.  పడవల ద్వారా ముంపు ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమందికి కేశవ మెమోరియల్‌లో ఆవాసం కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో గుర్రపు డెక్కను తొలగించే పనుల్లో కూడా పాలుపంచుకున్నారు.   




ఇదిలా ఉంటే, లాక్‌డౌన్ సమయంలోనూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సేవా భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి కోవిడ్ - 19 సోకిన వారికి అనుభవజ్ఞులైన డాక్టర్లతో సలహాలు, సూచనలు అందించారు. అంతేగాక మెడికల్ కిట్లను అందజేశారు.  

Updated Date - 2020-10-15T21:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising