ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల కొరత ఉందని అంటున్నారు.. కానీ..

ABN, First Publish Date - 2020-04-07T16:36:35+05:30

కూరగాయల సప్లైకి తగిన డిమాండ్ లేదా? మార్కెట్‌లోకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కూరగాయల సప్లైకి తగిన డిమాండ్ లేదా? మార్కెట్‌లోకి దిగిన కూరగాయలు పూర్తి స్థాయిలో అమ్ముడుకావడంలేదా? కరోనా సందర్భంగా లాక్ డౌన్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవి ఎటువైపు దారితీయబోతున్నాయి... లాక్ డౌన్ వల్ల అంతా ఇంటికే పరిమితమయ్యారు. మాంసాహారం తింటే కరోనా వస్తుందన్న భయంతో దానికి డిమాండ్ తగ్గిందంటున్నారు. మరి ఇదే సమయంలో కూరగాయలకు డిమాండ్ పెరగాలికదా? కానీ ఆ పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సప్లయ్‌కి తగిన డిమాండ్ లేదని చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల భారీగా కొనుగోలు చేస్తున్నారని.. కూరగాయల కొరత ఉందని అంతా అనుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయన్నా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఒక్క తెలంగాణను తీసుకుంటే రోజుకు 30 లక్షల టన్నుల కూరగాయలు పండుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలే కాకుండా హోటళ్లు పూర్తి స్థాయిలో నడిస్తే సుమారు 25 లక్షల టన్నుల కూరగాయలు తెలంగాణకు అవసరమవుతాయి. మిగిలిన 5 లక్షల టన్నుల కూరగాయలు ఏపీ, కర్ణాటకకు ఎగుమతి అవుతాయి. ఇది ఓ దేశవాళి అంచన. అయితే ఇప్పుడు కరోనా దెబ్బకు ఎగుమతులులేవు. హోటల్స్ నడవడంలేదు. కొనేవారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో అవసరమైనదానికన్నా ఎక్కువ కూరగాయలు మార్కెట్‌లో ఉండిపోతున్నాయి. డిమాండ్ తగ్గడం ఓ కారణమైతే.. లాక్ డౌన్ వల్ల ఇంటివద్దకే వ్యాన్‌లలో కూరగాయలు తీసుకువచ్చి అమ్ముతుండడంతో మార్కెట్‌కు వెళ్లేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. 

Updated Date - 2020-04-07T16:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising