హైదరాబాద్‌లో శాటిలైట్ బస్ టెర్మినల్
ABN, First Publish Date - 2020-11-06T08:32:07+05:30
ఎల్బీ నగర్ కూడలి వద్ద సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులతో రద్దీగా ఉండకుండా హెచ్‌ఎండీఏ సరికొత్తగా శాటిలైట్ టెర్మినల్‌ను నిర్మించనుంది. హైదరాబాద్-
వనస్థలిపురంలో 65వ జాతీయ రహదారిపై రూ.10 కోట్లతో నిర్మించనున్న హెచ్‌ఎండీఏ
హైదరాబాద్ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎల్బీ నగర్ కూడలి వద్ద సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులతో రద్దీగా ఉండకుండా హెచ్‌ఎండీఏ సరికొత్తగా శాటిలైట్ టెర్మినల్‌ను నిర్మించనుంది. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వనస్థలిపురంలో మహావీర్ హరిణ వనస్థలి జింకల పార్కు సమీపంలోని 1.2 కిలోమీటర్ల పరిధిలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెర్మినల్‌ను నిర్మించనుంది. ఈ శాటిలైట్ బస్‌బే ఏర్పాటు పనులను తొలుత ఆటోనగర్ క్రీడా వద్ద 750 మీటర్ల విస్తీర్ణంలో చేపట్టనుంది. ఇందు కోసం హెచ్‌ఎండీఏ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాద్‌కు వచ్చే వాహనాల రద్దీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉంటుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉంటోంది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా శాటిలైట్ బస్‌బేల ఏర్పాటుపై హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
వీటికిరాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.10 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు.
Updated Date - 2020-11-06T08:32:07+05:30 IST