ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేటకు పోటెత్తిన ప్రజలు.. సంతోష్‌బాబుకు నివాళులు

ABN, First Publish Date - 2020-06-18T13:03:05+05:30

దేశం కోసం వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు భారీగా ప్రజలు, అభిమానులు తరలివస్తున్నారు. సూర్యాపేటలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: దేశం కోసం వీరమరణం పొందిన కర్నల్ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు భారీగా ప్రజలు, అభిమానులు తరలివస్తున్నారు. సూర్యాపేటలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. వేకువజాము నుంచే పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. ఘనంగా జోహార్లు అర్పిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ కరోనా వైరస్ సంక్రమణ చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ పార్థివదేహాన్ని సందర్శిస్తున్నారు.


ఉదయం 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని సూర్యాపేటలో ఉంచి.. తర్వాత కేసారం గ్రామంలో అంత్యక్రియలు జరపడానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఆర్మీ ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర చేపట్టనున్నారు. సూర్యాపేటకు నిన్ననే ఆర్మీ జనరల్ మేజర్లతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకున్నారు. పూర్తిగా ఆర్మీ లాంఛనాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మువ్వన్నెల జెండాను సంతోష్ బాబు పార్థివదేహాoపై ఉంచి  సమున్నతoగా ఆర్మీ అధికారులు గౌరవించారు. సంతాప సూచకంగా ఇవాళ సూర్యాపేట పట్టణంలో వ్యాపార, వాణిజ్య వర్తక సంఘాలు స్వచ్చందంగా బంద్ పాటించనున్నాయి.

Updated Date - 2020-06-18T13:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising