ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనం, పింఛన్ బకాయిలు ఒకేసారి నగదుగా ఇవ్వాలి...

ABN, First Publish Date - 2020-09-16T22:48:58+05:30

ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిలిపివేసిన మూడు నెలల వేతనాలు, పింఛన్ల బకాయిలను ఒకేసారి నగదురూపంలోనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక(జేఏసీ) డిమాండ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్ : ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిలిపివేసిన మూడు నెలల వేతనాలు, పింఛన్ల బకాయిలను ఒకేసారి నగదురూపంలోనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక(జేఏసీ) డిమాండ్ చేసింది.


 కరోనా లాక్డౌన్ కాలంలో రాష్ట్రప్రభుత్వ ఆదాయం తగ్గిందన్న కారణంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మార్చి, ఏప్రిల్, మే (మూడు) నెలల వేతనాలు, పింఛన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా చాలామంది  ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. కొందరు అప్పులపాలయ్యారు. కాగా... ఆర్డినెన్స్ లో పేర్కొన్నట్లుగా... ఆ వేతనాలు, పెన్షన్లను ఎప్పుడు చెల్లిస్తారో ఈ నెలాఖరులోగా ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఇక... ఆర్డినెన్సును చట్టం చేసే క్రమంలో శాసన సభ, శాసన మండలిలో సైతం ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఇంతవరకు ఆ ప్రకటన మాత్రం రాలేదు. 


ఈ నేపధ్యంలో... మూడు నెలల వేతనాలు, పింఛన్ల బకాయిలను వెంటనే ఏకమొత్తంగా నగదురూపంలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్టీరింగ్ కమిటీ సభ్యులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ  ఇ మెయిల్ ద్వారా లేఖలు పంపారు.

Updated Date - 2020-09-16T22:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising