26న ఆర్టీసీ కార్మికుల సమ్మె
ABN, First Publish Date - 2020-11-13T08:58:31+05:30
జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు.. ఈ నెల 26న
జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు.. ఈ నెల 26న నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, ఎస్‌డబ్ల్యూఎ్‌ఫ(సీఐటీయూ) కోశాధికారి ఏవీ రావు, కార్మిక పరిషత్ నేత ఆర్.రమేశ్, ఐఎన్‌టీయూసీ నేత అబ్రహాం.. ఆర్టీసీ అధికారులకు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు.
ఆర్టీసీల ఆదాయాన్ని కొల్లగొట్టే టూరిస్టు పర్మిట్ల ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈపీఎస్ పథకాన్ని మెరుగుపరచడంతోపాటు కనీస పెన్షన్ రూ.10వేలు ఉండేలా చూడాలన్నారు. డీజిల్‌పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు అమలు చేస్తున్న వ్యాట్‌ను తగ్గించాలన్నారు.
Updated Date - 2020-11-13T08:58:31+05:30 IST