ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజ్ఞానంతోనే అభివృద్ధి.. : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2020-12-18T05:14:02+05:30

విజ్ఞానంతోనే అభివృద్ధి.. : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

చలపర్తిలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌


దుగ్గొండి, డిసెంబరు 17 : విజ్ఞానంతోనే సమాజంలో మార్పు జరిగి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి, అడిషనల్‌ డీజీపీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని చలపర్తిలో నిరుపేద మహిళ మాచర్ల సుజాతకు స్వేరోస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా భీంహోం(గృహం) నిర్మాణం చేపట్టగా గురువారం సందర్శించి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం జ్ఞాన సమాజం కావాలన్నారు. స్వేరోస్‌ సంస్థ ద్వారా నిరుపేదలకు సాయం చేస్తున్న దాతలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలభద్రయ్య, సర్పంచ్‌ ముదురకోల శారదకృష్ణ, ఎంపీటీసీ సుమన్‌, స్వేరోస్‌ రాష్ట్ర నాయకుడు సదానందం, బి.రఘుపతి, చక్రి, పుల్ల కిషన్‌, బొడ్డు ప్రసాద్‌బాబు, రమేశ్‌బాబు, ఇసాక్‌, రాజేంద్రప్రసాద్‌, జ్యోతి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T05:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising