రెండు రోజులు తేలికపాటి వర్షాలు
ABN, First Publish Date - 2020-07-08T08:47:05+05:30
రెండు రోజులు తేలికపాటి వర్షాలు
హైదరాబాద్,(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
Updated Date - 2020-07-08T08:47:05+05:30 IST