ప్రజావ్యతిరేకత వస్తుందనే ధర్నా వాయిదా
ABN, First Publish Date - 2020-12-30T05:18:05+05:30
ప్రజావ్యతిరేకత వస్తుందనే ధర్నా వాయిదా
ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న ప్రభుత్వం : రేవూరి
నర్సంపేట, డిసెంబరు 29 : ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించే కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిర్వహించాల్సిన ధర్నాను జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విరమించుకున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టులకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)సమర్పిం చి అనుమతులు పొందాలని కేంద్ర జలమంత్రి రాష్ర్టానికి లేఖ రాశారన్నారు. డీపీఆర్ సమర్పించకుండా కేంద్రం ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ధర్నాను విరమించుకున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపెల్లి నర్సింహరాములు, పట్టణ అధ్యక్షుడు బాల్నె జగన్, మాజీ జిల్లా కార్యదర్శి రేసు శ్రీనివాస్, పంజాల రాము, మండల అధ్యక్షుడు కొత్తశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:18:05+05:30 IST