ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి: రేవంత్

ABN, First Publish Date - 2020-06-30T22:40:32+05:30

కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు రోజుకొకటి బయటపడుతున్నాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రూ. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు రోజుకొకటి బయటపడుతున్నాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రూ. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కేంద్రం, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లే కాలువకు గండి పడిందని.. చిన్న కాలువల పరిస్థితే ఇలా ఉంటే 50 టీఎంసీల మల్లన్నసాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌, గందమల్ల ప్రాజెక్టుల పరిస్థితి గురించి ఆలోచిస్తే భయమేస్తోందన్నారు. ఆ జలాశయాలకు ఇలాగే గండిపడితే వాటి పరిధిలో ఒక్క ఊరు కూడా మిగలదని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-30T22:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising