కొవిడ్ ఉందన్న అనుమానంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-10-03T15:26:52+05:30
తనకు కొవిడ్ వచ్చిందనే అనుమానంతో పాటు తనవల్ల కుటుంబ సభ్యులేవరూ బాధపడకూడదనే ఆందోళనలో జిల్లా స్థాయి రిటైర్డ్‌జడ్జి ఇంట్లో ఎవరులేని సమయంలో సూసైడ్‌నోట్ రాసి
హైదరాబాద్ : తనకు కొవిడ్ వచ్చిందనే అనుమానంతో పాటు తనవల్ల కుటుంబ సభ్యులేవరూ బాధపడకూడదనే ఆందోళనలో జిల్లా స్థాయి రిటైర్డ్‌జడ్జి ఇంట్లో ఎవరులేని సమయంలో సూసైడ్‌నోట్ రాసి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్ న్యూసైబర్‌వ్యాలీలోని నవనామి ఎలైట్ ప్లాట్ నెంబర్ 302లో రాజీవ్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాజీవ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి అదే ప్లాట్‌లో ఓ గదిలో ఒంటరిగా ఉండేవాడు. శుక్రవారం నాడు రామచంద్రారెడ్డి తన గదిలో నిద్రపోయాడు. ఆ తరువాత రాజీవ్‌రెడ్డి తల్లి గది తలుపుతీసి చూడగా రామచంద్రారెడ్డి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. వెంటనే రాజీవ్‌రెడ్డి తాడును కట్‌చేసి చూడగా అప్పటికే రామచంద్రారెడ్డి మృతిచెందాడు. మృతుడు రాసిన సూసైడ్‌నోట్‌లో తనకు కరోనా సోకినట్లు అనుమానంగా ఉందని తన వల్ల కుటుంబ సభ్యులు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-10-03T15:26:52+05:30 IST