ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మూడు మెట్రో స్టేషన్ల పునఃప్రారంభం

ABN, First Publish Date - 2020-12-03T08:01:38+05:30

కరోనా మహమ్మారి వల్ల 8 నెలలుగా మూతబడిన మెట్రో స్టేషన్లు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భరత్‌నగర్‌,ముషీరాబాద్‌, గాంధీ హాస్పిటల్‌లో రైళ్లు షురూ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల 8 నెలలుగా మూతబడిన మెట్రో స్టేషన్లు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్న స్టేషన్లను 2నెలల క్రితం ప్రారంభించి మెట్రో రైళ్లు నడిపిస్తున్న అధికారులు గురువారం నుంచి భరత్‌నగర్‌, ముషీరాబాద్‌, గాంధీ ఆస్పత్రిలోనూ ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.


సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరున్నరకే ప్రారంభిస్తున్నారు. ఆయా కారిడార్ల నుంచి రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే చివరి రైలు 10.30కు టెర్మినల్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌-రాయదుర్గం, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మార్గాల్లో గతంలో రోజూ 4 లక్షల మందికి పైగా ప్రయాణించేవారు.

కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల సంఖ్య 1.80-2 లక్షలకు తగ్గింది. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో అధికారులు ఆఫర్లను ప్రతిపాదించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు మాస్కులు ధరించి కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Updated Date - 2020-12-03T08:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising